![]() |
![]() |
తెలుగమ్మాయి ప్రియాంక నల్కరి అటు తమిళ్‌కి వెళ్ళి బాగా పాపులర్ అయ్యి తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది. ఐతే ఇక్కడ తన గురించి ఎవరు పట్టించుకోవడం లేదు అని ప్రాజెక్ట్స్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చింది. అలాగే అబ్బాయిల మీద తనకు నమ్మకం పోయిందని ప్రేమ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పుడు తన ఫ్యామిలీని తనకు ముఖ్యం అని చెప్పింది. ఆ బాధ పడలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు కూడా చెప్పింది. మనసులో చాలా ఆవేదన ఉన్నా బయటకు నవ్వుతూ కనిపిస్తున్నట్లు చెప్పింది. ఇంట్లో తన చెల్లెల్లు అమ్మ నాన్న బాధ్యత తానె చూసుకోవాలని ఇక ప్రేమ పెళ్లి వంటి వాటి మీద ఆసక్తి లేదు అని చెప్పింది. ఐతే చిన్నప్పటి నుంచి తనకు ఒక మంచి అబ్బాయి ఒక చిన్న బిడ్డ అలా ఒక హ్యాపీ ఫామిలీ ఫామిలీ ఉంటే బాగుండు అని కలలు కన్నానని చెప్పుకొచ్చింది. ఫ్యామిలీని బాగా చూసుకుంటే కష్ట సమయంలో వాళ్ళే తనకు అండగా ఉంటారని బయటవాళ్ళెవరూ ఉండరని చెప్పింది. ఐతే తనను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి ఒక జాబ్ ఒక సొంత ఇల్లు ఉంటే చాలని తనకు ముందు ప్రాముఖ్యత ఇవ్వాలని కోరింది ప్రియాంక . తమిళనాడులో రోజాగా పాపులర్ ఐన ప్రియాంక కష్టాలు మాత్రం మాములుగా లేవు.
![]() |
![]() |